నల్లమల అడవులు మన దేశంలో ఎంతో పెద్ద అడవులులో ఒకటిగా పేరు సంపాదించాయి.. ఇండియా అమెజాన్ అని పిలుస్తారు వీటిని.. అనేక రకాల జంతువులు ప్రజలకు బయట ప్రపంచానికి తెలియని ఇక్కడ ఉన్నాయి, దట్టమైన గుబురు అడవులుగా నల్లమల ఉంది..ఈ అడవుల్లో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు.
ఇక్కడ అనేక రకాల పులులు ఉన్నాయి,నాగర్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా ఉంది. గుడ్ న్యూస్ ఏమిటి అంటే గత పది సంవత్సరాలుగా ఇక్కడ జంతువుల సంఖ్య పెరిగింది..
నల్లమలలో 55 జాతుల క్షీరదాలు,
200 రకాల పక్షులు
54 రకాల సరీసృపాలు
55 జాతుల చేపలు ఉన్నాయి ఇక చాలా రకాల కీటకాలు ఉన్నాయి
ఇక్కడ ఇటీవల మారస్ శ్రీశైల యెన్సిస్ సాలీడు
రేజర్పాము
స్లెండర్ కోరల్ స్నేక్
డారిస్తీన్స్ రోస్ట్రాటస్గొల్లభామ
శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్
ఇసుక పాము
మూషిక జింక.
కణితి జింక
ఇలాంటి జంతువులు ఎన్నో ఉన్నాయి ఇవి ఇక్కడ తప్ప మరెక్కడా ఉండవు