బంగారం కొనేందుకు చాలా మంది సిద్దం అవుతున్నారు, ఎందుకు అంటే రోజు రోజుకి బంగారం ధర తగ్గుతూ వస్తోంది, పుత్తడి ధరలు భారీగా తగ్గుతున్నాయి, నేడు బంగారం వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధర ఎలా తగ్గిందో వెండి ధర కూడా అలాగే తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో రేటు రూ.46,900కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గింది..దీంతో రూ.43,000కు చేరింది.
బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు కూడా తగ్గింది.. వెండి ధర కేజీకి రూ.900 తగ్గింది… దీంతో రేటు రూ.73,400కు చేరింది వచ్చే రోజుల్లో బంగారం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, ఇక రెండు రోజులుగా బంగారం అమ్మకాలు పెరిగాయి.