గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి కాని ఎక్కడా తగ్గడం లేదు… బులియన్ మార్కెట్లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం, ఈ రోజు అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, వెండి కూడా పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగింది..దీంతో రేటు రూ.45,980కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరుగుదలతో రూ.42,150కు ట్రేడ్ అవుతోంది,ఇక బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు కూడా పెరుగుతోంది.
వెండి ధర కేజీకి ఏకంగా రూ.1800 పెరిగింది. దీంతో రేటు రూ.73,200కు చేరింది బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా బంగారం వెండి ధరలు మార్చిలో కాస్త పెరుగుదల నమోదు చేశాయి, ఇక ఫ్రిబ్రవరితో పోలిస్తే కాస్త పెరుగుదల కనిపించాయి.
ReplyForward
|