బంగారం ధర మార్కెట్లో తగ్గుముఖం పట్టింది, అంతర్జాతీయంగా రేట్లు తగ్గడంతో పాటు దేశీయంగా బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది.. ఇక ముంబై బులియన్ మార్కెట్లో నిన్నటి నుంచి అమ్మకాలు పెరిగాయి, మరి మన ఏపీ తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఆ ధరలు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది. దీంతో రేటు రూ.49,900కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గింది. రూ.45,750కు చేరింది.బంగారం ధర తగ్గితే .. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.600 తగ్గింది. దీంతో వెండి ధర రూ.70,700కు చేరింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది.