పసిడి ధర తగ్గిపోయింది బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి పసిడి ధర మళ్లీ తగ్గింది, ఇక బంగారం తగ్గితే వెండి ధర కూడా తగ్గింది.. మరి అంతర్జాతీయంగా బంగారం వెండి కూడా తగ్గింది మరి రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 దిగొచ్చింది. రూ.45,750కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 తగ్గింది. రూ.49,900కు చేరింది.
ఇక వెండి కూడా తగ్గింది మార్కెట్లో మరి కిలో వెండి ధర ఎంతో చూద్దాం..వెండి రూ.400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.70,300కు తగ్గింది…. మార్కెట్లో 70300 కు ట్రేడ్ అవుతోంది. వచ్చే రోజుల్లో మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు.