బంగారం ధర భారీగా తగ్గుతోంది మొన్న ఒక్కరోజు వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం తర్వాత రోజు 500 తర్వాత మళ్లీ 300 పెరిగినా మళ్లీ 250 తగ్గుదల నమోదు చేసింది… ఇలా పుత్తడి ధరలు తగ్గుతూ పెరుగుతూనే ఉన్నాయి.. అయితే నేడు కూడా భారీగా తగ్గింది బంగారం ధర.
ఇక బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు పుత్తడి ధరలు భారీగా తగ్గాయి,
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గింది. దీంతో రేటు రూ.45,220కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 తగ్గడంతో రూ.41,450కు చేరింది.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా తగ్గింది.. వెండి ధర కేజీకి రూ.500 తగ్గింది. దీంతో రేటు రూ.69,900కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.