పెరుగుతున్న బస్ పాస్ ఛార్జీలు ఇవే..

0
106

ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో సతమతవుతున్న ప్రయాణికులపై మరో భారాన్ని మోపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే స్టూడెంట్ పాసుల ఛార్జీలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదా? లేకి వచ్చే విద్యా సంవత్సరంలో పెంచుతుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

పెరుగుతున్న బస్ పాస్ ఛార్జీలు ఇవే:

బస్ పాస్ రకం పాత ధర కొత్త ధర

ఆర్డినరీ
950
1150

ఎక్స్ ప్రెస్
1070
1300

డీలక్స్
1185
1450

ఏసీ బస్సు
2500
3000

ఎన్జీవో ఆర్డినరీ
320
400

ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్
450
550

ఎన్జీవో డీలక్స్
575
700