కాంప్లిమెంట్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలకి ఇస్తారు అని అనుకుంటాం, అయితే కామెంట్స్ కాంప్లిమెంట్స్ అనేవి అమ్మాయిలకే కాదు, చాలా మంది అబ్బాయిలు కూడా ఇష్టపడతారట… ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తే చాలా ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా ఇలాంటి వారు పైకి చెప్పకపోయినా తమ హావభావాలతో ముఖంలో అన్నీ పలకరిస్తారు.
మగవాళ్ళు ఇష్టపడే కాంప్లిమెంట్స్ కొన్ని చూద్దాం, మరి మీ భర్త- ప్రియుడుకి ఏదైనా విషయంలో మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే ఇది తెలుసుకోండి…మీరు ఈ రోజు ఎంతో బావున్నారు, ఆ షర్ట్ మీకు బాగా నప్పింది.. మీరు బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, మీరు కారు బైక్ బాగా డ్రైవ్ చేస్తున్నారు, మీకు చాలా తెలివి ఉంది, అందరి కంటే షార్ప్ గా ఆలోచిస్తారు, ఇలాంటి మాటలు వారికి బాగా నచ్చుతాయట.
మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మీరు ఏ పని అయినా చేయగలరు, మీరు వంట చేసినట్లు ఎవరూ చేయరు అంత బాగుంటుంది అంటే కచ్చితంగా ఆయనలో చిరునవ్వు కనిపిస్తుంది, ఇలాంటి విషయాల్లో మగవారు చాలా ఆనందిస్తారట ఈ కాంప్లిమెంట్స్ కి.