గొడ్డు చాకిరీ చేయించుకుని..వాళ్ల హక్కులను కాలరాస్తున్నారు: రేవంత్ రెడ్డి

0
100

టీపీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అటు బీజేపీ, ఇట టీఆర్.యెస్ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. బీజేపీ,టిఆర్ఎస్ ఒక్కటే. ప్రజల దృష్టి మళ్లించడానికే బయటకు విమర్శలు చేసుకుంటున్నారని ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసే రేవంత్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై సీఎంకు లేఖలు రాస్తుంటారు. తాజాగా సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో ఆయన ఏం పేర్కొన్నారంటే..మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైంది. గొడ్డు చాకిరీ చేయించుకుని..వాళ్ల హక్కులను కాలరాస్తున్నారు. చాలీ చాలని జీతాలు ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉంది. వీఆర్ఒల కు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఏళ్లు గడుస్తున్నా అమలు చేయలేదు.

హామీలు ఇవ్వడం తప్ప…అమలు చేయాలన్న సోయి మీకు లేదు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య. విఆర్వోలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలి. అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కూడా కల్పించాలి. వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలి. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.