బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది, కేసుకు సంబంధించిన
కీలక విషయాలు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులో కొత్తగా 15 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు.
మాదాల సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్ కోసం ఏకంగా 20 మందిని పంపాడు..సిద్ధార్థ్ ఓ ఈవెంట్ మేనేజర్
సిద్ధార్థ్ కు అత్యంత సన్నిహితుడే మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను, ఇక ఈ కేసులో
అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం అని వివరించారు.
ఈ కిడ్నాప్ కు స్కెచ్ యూసఫ్ గూడలోని భార్గవరామ్ కు చెందిన స్కూల్లో పథక రచన చేశారు..
మొత్తం 5 లక్షల డీల్ చేసుకున్నారు, అడ్వాన్స్ గా సిద్దార్ద్ కి 75 వేలు అందించారు,
భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లతో స్టాంప్ పేపర్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు, పక్కా ప్లాన్ తో పోలీసు దుస్తులు ఐడీ కార్డులు చేయించుకున్నారు. ఫేక్ నెంబర్ తో ఇన్నోవా వాహనం ఎరెంజ్ చేశారు, ఆ కారు భార్గవరామ్ తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించామని వివరించారు.