దొంగ పనులు చేసి లంగ వేశాలు వేస్తున్నారు..రేవంతరెడ్డి

0
104
revanth reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి తెలంగాణాలో ధాన్యం కొనుగోలు సమస్య తలెత్తడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడల్లో భాగంగా వరి పండించే రైతులతో కూడా చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యం సమస్య తెలంగాణలో మాత్రమే ఎందుకు ఉంటుందని ప్రశ్నించాడు. గల్లీలో, ఢిల్లీలో ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారు. రాహుల్ గాంధీ పర్యటన జరుగుతున్న నేపథ్యంలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

మే 6, 7 తేదీలలో పర్యటన నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించాం. కేసీఆర్ అందమైన అబద్ధాలతో పూత పూసి రెండు సార్లు సీఎం అయ్యారు. దేశంలో రైతు ఆత్మహత్యలతో రెండో స్థానంలో తెలంగాణ ఉండడానికి కారణం కేసీఆర్ అని తెలిపారు . రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధర లేక 8 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ప్రకటించింది. నాలుగేళ్లలో 74 వేల మంది రైతులు చనిపోయారని, వారికి రైతుబంధు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు.

ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానని చిల్లిగవ్వ ఇవ్వలేదు. తెలంగాణ లో చిరు ధాన్యాల సాగు కనుమరుగయ్యాయి. తోటలన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అధికారికంగా జరిగేలా సహకరించాలి. ఆర్ట్స్ కాలేజ్ వద్ద కు రాహుల్ గాంధీ రావాలని మేమంతా తీర్మానం చేసుకున్నాం. రాహుల్ సభను తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నాం. కేసీఆర్ తీరుతో వానాకాలం సీజన్ లో వందలాది మంది రైతులు చనిపోయారు. ఇప్పుడు గోనె సంచులు, ట్రాన్స్ పోర్ట్ లేకుండా కుట్ర చేశారు. ఇప్పటికే రైతులు మూడు వేల కోట్లు నష్టపోయారు. మిల్లర్లు సేకరించిన ధాన్యానికి అధిక ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.

ఎఫ్.సి.ఐకి బియ్యం ఇయ్యకుండా మూడు వేల కోట్ల స్కాం చేశారు. ఈ స్కాంపై సీబీఐ విచారణ చేయాలి. సీఎస్ ఆధ్వర్యంలో దోపిడీ కి కొత్త స్కెచ్ వేశారు. 2800 కోట్లలో కేసీఆర్ కుటుంబం‌ ,మిల్లర్ల దోపిడీ ఎంతనేది తేలాలి. రాహుల్ సభ ద్వారా.. త్వరలో రానున్న సోనియమ్మ రాజ్యంలో రైతులకు ఏం చేస్తామో చెప్తాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చాం. మద్దతు ధర రైతు పాలసీలను చేశాం. గతంలో కాంగ్రెస్ తెచ్చిన రైతు పాలసీలను మోదీ , కేసీఆర్ తూట్లు పొడిచారు. బీజేపీ, టీ.ఆర్.ఎస్ చేస్తున్న డ్రామాలను రాహుల్ సభ ద్వారా ఎండగడుతాం. లక్షలాది మంది రైతులతో కదం తొక్కుతాం. మే 7 న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ఉంటారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీ వస్తారు. నేను ఆరోపణల్లో మీసమెత్తు తప్పున్నా..ఏ శిక్షకైనా సిద్దం మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజ్ లలో మెడికల్ కౌన్సిల్ తో ఒకే రోజు విచారణ జరిపించాలి. అవకతవకలు జరగలేదని నిరూపితమైతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలిపారు.ఈ ఒక్క పరీక్ష కు నిజాయితీగా నిలబడండి. అన్ని దొంగ పనులు చేసి లంగ వేశాలు వేస్తున్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీ లకు చూపించిన వాటిపై విచారణ కు సిద్దపడడండి.