తీర్పు చెప్పిన తర్వాత రాత్రి జడ్జీలు ఎక్కడికి వెళ్లారో తెలుసా

తీర్పు చెప్పిన తర్వాత రాత్రి జడ్జీలు ఎక్కడికి వెళ్లారో తెలుసా

0
105

శతాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం కీలకమైన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడం విశేషం. అయితే ఆయన ఎలాంటి తీర్పు ఇస్తారు అనే విషయంలో దేశ వ్యాప్తంగా అందరూ ఎదురుచూశారు ఇక అదే ఫైనల్ తీర్పు దీనిపై మళ్లీ ఎలాంటి చర్చలు జరగవు అనేలా అందరూ మాట్లాడుకున్నారు ఇటు దేశంలో ఎలాంటి పరిస్దితి ఉంటుందా అనే ఆందోళణ ప్రభుత్వానికి కలిగింది.

చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ పలు పిటీషన్లు కొట్టివేయడంతోనే ఈ భూమి ఇక రాముడికే చెందుతుంది అని అందరూ భావించారు అలాగే తీర్పు వచ్చింది. ఇక ఐదుగురు న్యాయమూర్తులు దేశంలో అత్యంత క్లిష్టమైన కేసుకి తీర్పుని ఇచ్చారు, వీరికి ఈ కేసు విషయంలో తీవ్ర ఒత్తిడి తో పాటు.. పని భారం ఈ కేసు కారణంగా చోటు చేసుకుందన్న విషయాన్ని మర్చి పోకూడదు.1045 పేజీల తీర్పు రాశారు అంటే కేసు ఎంత పరిశీలించారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే కొన్ని వార్తల ప్రకారం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం శనివారం సాయంత్రం వేళ విరామం కోసం కలుసుకున్నట్లు గా తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ మాన్ సింగ్ లో విందు కు హాజరైనట్లుగా చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి తర్వాత కాస్తంత విరామం కోరుకోవటం తప్పేం కాదుగా అదే వీరు తీసుకున్నారు. అంతేకాదు దాదాపు 40 రోజులు మన దేశంలోనే బెస్ట్ న్యాయమూర్తులుగా ఉన్నవీరు ఒకే కేసుపై ఇన్ని రోజులు ఇరువురి వాదనలు వినడం కూడా ఇదే తొలిసారి.. అందుకే కాస్త విరామం కోసం అక్కడ కలిశారని వార్తలు వస్తున్నాయి, ఈ కార్యక్రమానికి మరెవరు రాలేదు అని వారి కుటుంబ సభ్యులు న్యాయపతులు సీనియర్ ఉద్యోగులు మాత్రమే హజరు అయ్యారు అని వార్తలు వస్తున్నాయి.