తిరుమలలో సంక్రాంతి నుంచి వాటిపై నిషేధం

తిరుమలలో సంక్రాంతి నుంచి వాటిపై నిషేధం

0
86

తిరుమలని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దతున్న విషయం తెలిసిందే, ఆనంద నిలయం పరిసరాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ ని వినియోగించడం లేదు, తాజాగా
పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అత్యంత పరిశుభ్ర ప్రదేశంగా తీర్చిదిద్దుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియచేశారు. సంక్రాంతి తర్వాత తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే చాలా వరకూ ప్లాస్టిక్ లేకుండానే కనిపిస్తోంది.

అయితే వచ్చే నెల అలాగే సంక్రాంతికి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ సీసాల వినియోగానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తిరుమల వ్యాప్తంగా మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమలలో నీటికొరత ఇబ్బంది లేదని, మరో రెండేళ్లకు సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

మొత్తానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఇలా వేటిని కూడా పైన తిరుమలలో అలౌ చేసే అవకాశం లేదు అని తెలుస్తోంది.. ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది తితిదే. మొత్తానికి ఇది మంచి నిర్ణయం అనే చెప్పాలి, నీటి ధరల దోపిడిని కూడా అరికట్టవచ్చు అంటున్నారు సామాన్య భక్తులు.