తిరుమలలో నేటి నుంచి ఉచిత లడ్డూ, మరిన్ని లడ్డూలు కావాలి అంటే ఇలా చేయండి

తిరుమలలో నేటి నుంచి ఉచిత లడ్డూ, మరిన్ని లడ్డూలు కావాలి అంటే ఇలా చేయండి

0
114

తిరుమలలో రేపటి నుండి ఉచిత లడ్డూ అందించనుంది తి.తి.దేవస్ధానం.. ఇటీవలే తిరుమల బోర్డు శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు..జనవరి 20 నుంచి శ్రీవారి దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డు అందిస్తామని వెల్లడించారు. అదే నేటి నుంచి అమలు చేస్తున్నారు.

అంతేకాదు ఒక లడ్డు మీకు ఉచితంగా ఇస్తారు.. మీకు మరికొన్ని లడ్డూలు అదనంగా కావాలి అంటే డబ్బులు చెల్లించి ఎన్నిలడ్డూలైనా తీసుకోవచ్చు. అయితే శ్రీవారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చే భక్తుడికి మాత్రమే ఉచిత లడ్డూ ఇస్తామని తెలిపారు. మీకు అదనంగా లడ్డూ కావాలంటే ఒక్కొక్కటి రూ.50 చొప్పున కొనుగోలు చేయవచ్చు. అయితే తితిదే నిర్ణయం బాగుంది అని భక్తులు అంటున్నారు.

ఈ ఉచిత లడ్డూ ప్రకటన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలియచేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్వనున్నారు. గతంలో చూస్తే కేవలం నడకదారి ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది..ఇక లడ్డూల కోసం రష్ ఉంటుంది కాబట్టి, ఇందుకోసం తిరుమలలో 12 అదనపు లడ్డూ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.. సో తిరుమల వెళితే మీకు ఎన్ని లడ్డూలు కావాలి అంటే అన్ని తీసుకోవచ్చు.