ఈ జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం వెనుక రీజన్ అదే…

ఈ జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం వెనుక రీజన్ అదే...

0
85

ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది… ఏపీలో 11 జిల్లాలు కరోనా దాటికి హాట్ స్పాట్ లుగా మారాయి… రోజుకు పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి… కానీ విజయనగరం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు…

ఈ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా ఈ జిల్లాకు విశాఖపట్నం జిల్లా అనుకునే ఉంది… కానీ దాదాపు 20 రోజుల నుంచి ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు… దీనికి ప్రధాన కారణం అక్కడి అధికారులే అని చెప్పాలి… పొరుగున ఉన్న విశాఖలో ఇరవై కేసులు నమోదు అయ్యాయి…

విదేశాలు మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య విశాఖలో ఎక్కువగా ఉంది… ఇక విజయనగరం జిల్లా నుంచి ప్రతీ రోజు వేలాది మంది విశాఖకు వెళ్లి వస్తుంటారు… ఈ నేపధ్యంలో జిల్లాలో ఒక్క కేసు నమోదు కాకపోవడం వెనుక పకడ్బందీ చర్యలే అని అంటున్నారు…