టెస్లా ఈ కంపెనీ ప్రపంచంలో ఇప్పుడు ఓ సంచలనం , అందరూ ఈ కార్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అనేక కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది ఈ కంపెనీ… అంతేకాదు ఈ కంపెనీ కారు కొనాలి అని చాలా మంది క్యూ కడుతున్నారు..
టెక్నాలజీతో ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తోంది… ఇంట్లో ఉండి డోర్ లాక్ చేయడం ఏసీ ఆఫ్ చేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం టీవీ ఆన్ చేయడం ఇలా అంతా స్మార్ట్ టెక్నాలజీతో చేస్తున్నాం.
కార్ పార్కింగ్ ఏరియాలో ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అయితే వికలాంగులకి ఇది మరీ ఇబ్బంది పక్కన కారు ఉంటే వారు కారు ఎక్కడానికి దిగడానికి కూడా చాలా ఇబ్బంది….వీల్ చైర్లో ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఒకరు పార్కింగ్లో ఉన్న తన కారు డోర్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటాడు.
తన జేబులో ఉన్న స్మార్డ్ ఫోన్ తీస్తాడు. అందులో క్లిక్ చేయగానే పార్కింగ్లోంచి తన టెస్లా కారు వచ్చి తన ముందు ఆగుతుంది. సో ఇది అందరిని ఆకట్టుకుంటోంది.. ఎంత గొప్ప టెక్నాలజీ అని అందరూ అంటున్నారు, ట్విట్టర్ లో ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది..2019లో వచ్చిన టెస్లా అటానమస్ పార్కింగ్ ఫీచర్ సూపర్ అంటున్నారు అందరూ..ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ ఉన్న కార్లలో ఈ ఫీచర్ పెట్టారు.
వీడియో చూడండి