మనం ఏ ఖరీదైన వస్తువు కొన్నా ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చూసుకుంటాం, అయితే ఎంతో విలువైన జీవితానికి కూడా ఇన్సూరెన్స్ ముఖ్యం, అంతేకాదు మనిషికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా ఆర్ధిక భరోసా మన కుటుంబానికి ఇవ్వడానికి ఈ ఇన్సూరెన్స్ ఎంతో సాయం చేస్తుంది, అయితే ముఖ్యంగా వెహికల్స్ కు కూడా ఈ ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యం.
ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా బీమా కలిగి ఉండాలని మోటార్ వెహికల్ చట్టం చెబుతోంది. మన దేశంలో 25 కంపెనీలు ఇన్సూరెన్స సెక్టార్ లో ఉన్నాయి, మరి మంచి ప్లాన్ ని ఎంచుకోవడం మన బాధ్యత.
భీమా చేసిన వ్యక్తి , భీమా సంస్థలు వరుసగా ఫస్ట్, సెకండ్ పార్టీ అయితే, వాహనం కారణంగా ప్రమాదానికి గురైన మరొక వ్యక్తికి అందేజేసే కవరేజ్ను థర్డ్ పార్టీ కవరేజ్ అంటారు… ఇలా థర్డ్ పార్టీ కవరేజీలో ఏ వాహనదారుడు అయితే ప్రమాదానికి గురి అయ్యాడో అతనికి వైద్య ఖర్చులు బండికి మరమ్మత్తులని నగదు చెల్లిస్తుంది భీమా కంపెనీ… మీరు చెల్లించిన నగదు ఆ కంపెనీ ఇస్తున్న
కవరేజీ బట్టీ నగదు ఇవ్వడం జరుగుతుంది.