చెట్టు కింద నలుగురు – పిడుగు పడింది -ఒళ్లు గగుర్పొడిచే ఘటన వీడియో ఇది

-

ఎప్పుడు ఎలాంటి పరిస్దితి ఉంటుందో తెలియదు, ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి.. నిజమే నిపుణులు చెబుతూ ఉంటారు అసలు చెట్ల కింద భారీ వర్షం పడుతున్న సమయంలో ఉండద్దు అంటారు, అంతేకాదు ఉరుములు మెరుపులు పిడుగులు పడే సమయంలో ఇలా చెట్ల కింద ఉండద్దు అని చెబుతారు.. ఇలా ఉంటే ఎంత ప్రమాదమో ఇక్కడ వీడియో చూస్తే తెలుస్తుంది.
హర్యానాలోని గురుగ్రామ్ లో  ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది, వేల వోల్టుల శక్తి ఉన్న పిడుగు  చెట్ల కింద ఉన్న వారిపై పడింది,  దీంతో నలుగురు ఒక్కసారిగా కింద పడిపోయారు,  గురుగ్రామ్ సెక్టార్ 82లోని వాటికా సిగ్నేచర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది.
వర్షం పడుతోందని  విల్లాస్ లో పనిచేసే నలుగురు తోటమాలులు ఓ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. వెంటనే అక్కడ ఓ పిడుగు పడింది, వెంటనే సెకన్లలోనే వారు కుప్పకూలిపోయారు….వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు…. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు…. ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఈ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...