ప్రధాని మోడీ సభపై సీఎం కేసీఆర్ రియాక్షన్ ఇదే..

0
81

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇప్పటికే 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రగతిభవన్ లో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాబోయే 4,5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులను అలెర్ట్ చేశాం. రెండు హెలికాఫ్టర్లు, భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాం.

ప్రధాని మోడీ సభపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాజకీయ సందర్భం కాకపోయిన మాట్లాడాల్సి వస్తుంది. దేశాన్ని బీజేపీ జలగలా పీడిస్తుంది. ప్రధాని ఏం మాట్లాడారో అర్ధం కాలేదు. అవినీతి, అసమర్ధ పాలన బీజేపీ కొనసాగిస్తోంది. ప్రధాని మోడీ మాట్లాడింది ఏమి లేదు. నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా మోడీ సమాధానం చెప్పలేదు. ప్రధాని, మంత్రులు, పార్టీ అధ్యక్షులు కూడా స్పందించలేదు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది. ఇచ్చేది ఏమి లేదు.