స్మార్ట్ఫోన్ ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో ఉంది, ముఖ్యంగా ఫోన్ లేనిదే ఎవరూ బయటకు అడుగు కూడా వేయడం లేదు..
అయితే ఎంతో జాగ్రత్తగా చూసుకునే ఫోన్ నీటిలో పడితే ఇక దాని పని అంతే అని భయపడిపోతాం.. మరి నిజంగా ఫోన్ వాటర్ లో పడితే ఏం చేయాలి. కంగారు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ముందు ఆ ఫోన్ ని వెంటనే పొడిగుడ్డతో తుడవాలి.. ఫుల్ గా దానిని గుడ్డతో కప్పాలి.. ఇలా చేస్తే ఆ నీరు అంతా ఆ క్లాత్ పీల్చుకుంటుంది, ఎట్టి పరిస్దితిలో ఎయిర్ డ్రైయ్యర్ వాడద్దు , సెల్ ఫోన్ విప్పేసి పార్ట్ లు హీట్ చేయద్దు, ఇక వాటర్ లో తీసి వెంటనే ఫోన్ ఆన్ చేయకండి, బటన్స్ కూడా ప్రెస్ చేయవద్దు.
మీరు నోటితో ఫోన్ లోని నీరు ఊదితే, నీరు డివైస్లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్కు గురి చేస్తుంది.
మీ ఫోన్ ఆన్ లో ఉన్న సమయంలో వాటర్ లో పడితే వెంటనే ఆఫ్ చేసి సిమ్ కార్డ్ బ్యాటరీ అన్నీ తీసేయండి, ఇలా గాలికి వదలాలి, ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి. ఇక బియ్యం సంచిలో ఫోన్ వేసినా ఆ బియ్యం వాటర్ ని పీల్చుకుంటాయి కాబట్టి ఫోన్ వెంటనే ఆరుతుంది.. తర్వాత సర్వీస్ సెంటర్కే తీసుకెళ్లడం మంచిది. మీ సొంత ప్రయత్నాలు చేయవద్దు సున్నిత పార్ట్ లు దెబ్బ తింటాయి.