వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది… నేడు ఆరుగురు పేర్లను ప్రకటించారు, ఇక సీఎం జగన్ హామీ ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ఇక్కడ హామీ నెరవేర్చారు. మరి ఆరుగురు ఎవరు అనేది చూద్దాం.
1.. చల్లా భగీరథరెడ్డి
2.. దువ్వాడ శ్రీనివాస్
3..మహ్మద్ ఇక్బాల్
4..బల్లి కల్యాణ్ చక్రవర్తి
5.. సి. రామచంద్రయ్య
6.. కరీమున్నీసా
వీరు ఆరుగురు పేర్లను ప్రకటించారు, ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో మార్చి 29న ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు, మార్చి 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్… అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇక సీమ నుంచి నలుగురికి కోస్తా నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు సీఎం జగన్.