మోగిన ఎన్నికల నగారా..ఐదు రాష్ట్రాల పోలింగ్ షెడ్యూల్ ఇదే..

This is the polling schedule of five states.

0
78

ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.

కరోనా నిబంధనలతో సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 5 రాష్ట్రాల్లో 2,15,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 5 రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. 5 రాష్ట్రాల్లో 18 కోట్ల 34 లక్షల మంది ఓటర్లున్నారు. ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు స్వీకరిస్తామని, కరోనా సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని సీఈసీ తెలిపారు. ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

403 సీట్లతో దేశంలో అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత, మార్చి 3న ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 14న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

యూపీ అసెంబ్లీ ఎన్నికల వివరాలు

ఫిబ్రవరి 10న తొలిదశ పోలింగ్.

ఫిబ్రవరి 14 రెండో దశ పోలింగ్.

ఫిబ్రవరి 20 మూడో దశ పోలింగ్

ఫిబ్రవరి 23 నాలుగో దశ పోలింగ్.

ఫిబ్రవరి 27 ఐదవ దశ పోలింగ్.

మార్చి 3 ఆరవ దశ పోలింగ్.

మార్చి 7 న ఏడో విడత పోలింగ్.

పంజాబ్, ఉత్తరఖాండ్, గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్.

మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న 2 విడతల్లో ఎన్నికలు.

మార్చి 10న కౌంటింగ్, ఫలితాలు.