బిపిన్ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం ఇదే..!

-

భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే విమానంలో సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ ఘటనకు ప్రతికూల వాతావరణం కారణంగా ఏర్పడే కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ ఇన్‌టూ టెర్రెయిన్​నే (సీఎఫ్​ఐటీ) ప్రధాన కారణంగా గుర్తించినట్లు వెల్లడైంది.

- Advertisement -

ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చేరింది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధురి, ఎయిర్‌ మార్షల్‌ మానవీంద్ర సింగ్‌ నేతృత్వంలో జరిగిన దర్యాప్తునకు సంబంధించిన విషయాలను కేంద్రమంత్రికి బుధవారం వివరించారు. అయితే, తాజా నివేదికపై మాత్రం ఇప్పటివరకు అటు ప్రభుత్వం నుంచి కానీ, భారత వాయుసేన నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో 2021 డిసెంబరు​ 8 హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది దుర్మరణం చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...