ఆస్ట్రేలియాలో ఒక పావురం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది, ఇక్కడ అధికారులు ఇటీవల ఓ పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు.. అది రేసింగ్ పావురం..అమెరికా నుంచి వచ్చిన రేసింగ్ పావురమని వారు భావించారు. అయితే ముందు దీనిని చంపాలి అని భావించారు.. ప్రధానంగా భద్రతా కారణాల వల్ల కాని ఈ పావురం ఇప్పుడు బయటపడుతోంది.
ఎందుకు అంటే దాని కాలికి ఉన్న ట్యాగ్ వల్ల …దాని లెగ్ ట్యాగ్ నకిలీదని తాజాగా నిపుణులు ధ్రువీకరించారు. అలబామా నుంచి ఆస్ట్రేలియా వచ్చినట్లు గుర్తించారు ఈ పావురాన్ని అధికారులు, దీని వల్ల ఏమైనా వ్యాధులు కొత్త రకం జబ్బులు వస్తాయి అని ముందు భయపడ్డారు.
కాని పక్షుల సంరక్షణకు పాటుపడుతున్న నిపుణులు, పర్యావరణవేత్తలు మాత్రం దానిని చంపద్దు అంటున్నారు..టర్కిష్ టంబ్లర్ అనే సాధారణ పావురం ఇది, దీనికి శిక్ష వద్దు అని తెలిపారు, దీంతో ఇది ఈ శిక్ష నుంచి బయటపడింది.