కొన్ని కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఎప్పుడూ ఎక్కడా వినని కనని ఘటనలు జరుగుతూ ఉంటాయి, అలాంటిదే ఇది కూడా ..ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలో కొడుకు చనిపోయి విధవరాలిగా మారిన కోడలిని మామ పెండ్లి చేసుకున్నాడు. కృష్ణా రాజ్పుత్ సింగ్కు గౌతమ్ రాజ్పుత్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక కుమారుడికి ఆర్తి అనే అమ్మాయినిచ్చి వివాహం చేశారు.
అయితే రెండు సంవత్సరాలు బాగానే సంసారం సాగింది, కాని కొడుక్కి ఓ ప్రమాదం జరిగింది దీంతో గౌతమ్ మరణించాడు, అప్పటి నుంచి కోడలు అత్తగారి ఇంట్లోనే ఉంటోంది, .రాజ్పుత్ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. దీంతో భర్త మరణించినప్పటి నుంచి రెండేండ్లపాటు ఆర్తిసింగ్ ఇంట్లోనే ఉండిపోయింది.
ఇక వారి వంశం ప్రకారం ఆమెకి మరో వివాహం చేయవచ్చు, అయితే ఈ విషయాన్ని పెద్దల్లో పెట్టారు, ఇక మామ తనని బాగా చూసుకుంటున్నారు కనుక ఆయనకు ఇష్టం ఉంటే నేను మామని పెండ్లి చేసుకుంటాను అని కోడలు చెప్పింది.
దీంతో వారి సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వారి వివాహం జరిగింది.