పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే..

0
98

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

పర్యటన షెడ్యూల్ ఇదే..

ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి రెండుగంటల వరకు పెద్దపల్లి జిల్లా కేంద్రం చేరే అవకాశం.

లంచ్ అనంతరం నూతన కలెక్టరేట్, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.

సాయంత్రం 4:30 గంటలకు జిల్లా కేంద్రం శివారు పెద్ద కల్వలలో బహిరంగ సభ.

సభా ప్రాంగణం వద్ద 3000 పోలీస్ లతో కట్టుదిట్టమైన బందోబస్తు