ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

0
107

భాగ్యనగరమంతా కాషాయమయం అయింది. ప్రధాని మోడీ పర్యటనతో రాజకీయం వేడెక్కింది. భాజపాకు పోటీగా టీఆర్ఎస్ కూడా పొలిటికల్ లొల్లి మొదలెట్టింది. తాజాగా రాష్ట్రంలో ప్రధాని మోడీ సభతో ఒక్కసారిగా రాజకీయం తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీల లొల్లి నుండి మొదలు పెడితే ‘సాలు దొర సంపకు దొర’, సాలు మోడీ సంపకు మోడీ వంటి క్యాప్షన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ హైద్రాబాద్ రానున్నారు. దీనితో భారీ ర్యాలీ నిర్వహించాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి చేరుకున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్​ రానున్నారు.

ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో దిల్లీలో బయలుదేరి.. 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

బేగంపేట నుంచి 3.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు బయలుదేరుతారు.

3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు. 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్‌ సమయంగా ఉంచారు.

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు.

ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.

సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్తారు.

సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు.

రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కు గానీ.. హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు.

సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరుతారు.

ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.