మద్యం తాగేవారు ఈ మధ్య బాగా పెరిగిపోతున్నారు, అయితే ఇది వరకు పురుషులకి పరిమితం అయిన ఈ మద్యపానం ఇప్పుడు మహిళలు కూడా తాగుతున్నారు, అయితే మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి, అంతేకాదు మహిళలు పోటీ పడి మరీ తాగుతున్నారు.
మన దేశంలో అత్యధికంగా మద్యం తీసుకునే మహిళలు ఏ స్టేట్ లో అంటే అస్సాం అని తెలుస్తోంది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో 26.3 శాతం మద్యం తాగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది.
మరి మిగిలిన స్టేట్స్ లో చూస్తే మేఘాలయ 8.7, గతంలో కంటే ఇది మరింత పెరిగింది అని తెలుస్తోంది. నిత్యం తాగేవారి కంటే వారానికి మద్యం ఎక్కువగా తీసుకునే వారు ఉన్నారు, ఇక పొగాకు కూడా ఇక్కడ బాగా వినియోగిస్తున్నారు.