మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం నాగస్వరం ఊదితే ఇక పాము అటూ ఇటూ పడగ ఊపుతూ కనిపిస్తుంది అని.. అయితే ఇది అంత నమ్మదగ్గ విషయం కాదు అంటున్నారు సైంటిస్టులు. ఇక్కడ అసలు విషయం మీరు గ్రహించాలి.
పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే అది గ్రహిస్తుంది అంతేకాని గాలి నుంచి వచ్చే శబ్దం అది వినలేదు.
నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా మీకు చూపించేదీ మీరు నమ్మకండి ….ఎందుకు అంటే ఇలా బూర నాగస్వరం ఊదేవాడు ముందు నేలమీద చేతితో చరుస్తాడు. అప్పుడు నేల నుంచి అది తరంగం వెళుతుంది.. దానిని అది గ్రహించి ఆ శబ్దం ఎటు వచ్చిందో అటు తిరుగుతుంది… అటు నుంచి బూర ఊదుతాడు అప్పుడు అది అతనిని చూస్తు ఉంటుంది.
దాని కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ కనిపిస్తుంది కాబట్టి అది కాటు వేయాలి అని అలా పడగవిప్పి చూస్తుంది.. ఇలా పాముల వాడే కాదు, ఎవరు అయినా సరే ఎదురుగా ఉన్నా గుడ్డ తెల్లని టవల్ తో ఊపినా అది మీదకు వస్తుంది. నాగస్వరం
వల్లే తల ఊపుతుంది అని మాత్రం నమ్మకండి.