దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతోంది ఇక్కడే

-

దేశంలో కరోనా విజృంభిస్తోంది, భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు సంఖ్య పెరుగుతోంది కాని తగ్గడం లేదు.. తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా విస్తరిస్తోంది… అయితే దీనికి కారణం అలసత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు వైద్యులు.. ముఖ్యంగా గత ఏడాది రికార్డులు కూడా తిరగరాస్తోంది ఈ మహమ్మారి…మహారాష్ట్రని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది
ఇక మళ్లీ గత ఏడాది రోజులు గుర్తు చేస్తోంది… అంతేకాదు కనివినీ ఎరుగని రీతిలో అక్కడ కేసులు పెరుగుతున్నాయి..
గురువారం ఒక్కరోజే దాదాపు 36వేల కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది…దేశంలో వచ్చిన కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు అక్కడ నమోదు అవుతున్నాయి.
ఇక గత ఏడాది మన దేశంలోకి కరోనా ప్రవేశించింది అప్పటి నుంచి చూస్తే మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి… ఇంత భారీ స్ధాయిలో కేసులు నమోదు అయ్యాయి…గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 35,952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 111 మంది మరణించారు. ఇక్కడ నాలుగు రోజుల్లో 1 లక్ష కేసులు నమోదు అయ్యాయి. ఇక ముంబైలో అన్నింటికంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ 5500 పాజిటీవ్  కేసులు నిన్న నమోదు అయ్యాయి.. 14 మంది మరణించారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావిలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ముంబైలో  వ్యాపారులు కూడా చాలా వరకూ దుకాణాలు  క్లోజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...