ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే జరిగింది…జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక కూడా విశాఖ రాజధానిగా తెలుస్తోంది, అయితే దీనిపై పూర్తి నిర్ణయం కేబినేట్ తీసుకోబోతోంది.. ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఈ నివేదిక వెలువడ్డ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. మొత్తానికి అనుకున్న విధంగానే రైతుల ప్రయోజనాలు కాపాడతాము అని తెలియచేశారు.
ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇస్తామని మరోమారు స్పష్టం చేశారు. అయితే, అసైన్డ్ భూములను మాత్రం సంబంధిత రైతులకే తిరిగి ఇచ్చేస్తామని, ఆ తర్వాత కావాలంటే వాళ్లు మళ్లీ అమ్ముకోవచ్చని చెప్పారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీ నివేదికలను గత ప్రభుత్వం పక్కన పెట్టి నారాయణ కమిటీతో ముందు కెళ్లారని విమర్శించారు. చంద్రబాబు అందరిని మోసం చేశారు అని ఆయన విమర్శించారు. మొత్తానికి ఈనెల 27 జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారు అనేది తేలిపోయింది అని చెప్పాలి.