ఏపీ రైతులకి అండగా ఉంటాను అంటున్నారు పవన్ కల్యాణ్… దీని కోసం కాకినాడలో ఈ నెల 12న
నిరాహారదీక్ష చేపడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనిపై జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు పవన్ కల్యాణ్ చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. అయితే దీనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది, పవన్ దీక్షకు తాము మద్దతు అంటూ జనసేన అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పిలుపు కూడా అందింది అందరికి.
ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో నిరసన దీక్ష చేయనున్నారు..వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయితే పవన్ ఇక్కడ ఎందుకు ఫోకస్ చేశారు అంటే ఇక్కడ రైతులు ఇబ్బందులు ఇటీవల పవన్ కు చెప్పుకున్నారు.. ఇక్కడ నుంచే పవన్ తన దీక్ష గురించి చెప్పడంతో కాకినాడని ఎంచుకున్నారు.
ఈ నెల 12న పవన్ దీక్ష అక్కడ ఎందుకంటే
ఈ నెల 12న పవన్ దీక్ష అక్కడ ఎందుకంటే