ఓ పక్క దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, ఈ సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు.. కేవలం నిత్య అవసర వస్తువులకి మినహ ఎవరూ దేనికి బయట అడుగు పెట్టడం లేదు ఈ సమయంలో కాలేజీలు స్కూల్లు కూడా మూసివేశారు, అయితే ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక చాలా స్టేట్స్ లో స్కూల్ స్టూడెంట్స్ ఒకటి నుంచి 9 వరకూ తర్వాత తరగతులకి ప్రమోట్ చేశారు .
తాజాగా ఈ నెల 21 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్ ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడకూడదని, కావున ఆన్‌లైన్‌లో వీరందరికీ క్లాసులు ప్రారంభించాలని ఆదేశించింది.
అయితే ఎవరూ కాలేజీలకు హజరుకారు అని తెలుస్తోంది, టీచర్ టీచింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా విడుదల చేస్తారు, దీనికోసం స్కైప్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ వంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగించుకోవాలని చెప్పింది సర్కార్ . అలాగే ఈ ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన వీడియోలను రికార్డు కూడా చేయాలని స్పష్టంచేసింది.