సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, పూర్తిగా దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడతారని, ఈ నెల 15 లేదా 25 న ప్రధాని మోదీ ప్రకటన చేస్తారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి, కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తథ్యం అని అంటున్నారు, అయితే దీనిపై ఎవరూ ఏమీ సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలు చాలా మంది నమ్ముతున్నారు.
ఈ సమయంలో ఈ వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. అవి గాలి కబుర్లేనని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది.
ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో చాలా మంది ఇది ఫేక్ అని తేల్చిపారేశారు, అందుకే ఇలాంటి వార్తలని ఎట్టి పరిస్దితుల్లో నమ్మకండి అని చెబుతున్నారు నిపుణులు ఉద్యోగులు.