ఈ నెంబర్లు ఈ మెయిల్స్ లింక్స్ ఓపెన్ చేయవద్దు – కేంద్రం

ఈ నెంబర్లు ఈ మెయిల్స్ లింక్స్ ఓపెన్ చేయవద్దు - కేంద్రం

0
90

ఇప్పుడు ఈజీగా డబ్బు కొట్టేయాలి అని సైబర్ నేరగాళ్లు స్కెచ్ వేస్తున్నారు, ఈజీగా మోసపోయేవారే వారి టార్గెట్ అందుకే ఓ మెయిల్ మెసేజ్ పంపి వారిని బురిడీ కొట్టించి చివరకు కోట్లు కొట్టేస్తున్నారు, లక్షలు వేలు కూడా దోచేస్తున్నారు. ఇక తాజాగా వైరస్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో ఉచితంగా టెస్టులు చేస్తాం అని లింకులు పంపుతున్నారు.

అందులో డీటెయిల్స్ ఇవ్వండి అని కోరుతున్నారు, అలాంటివి ఏవీ ఓపెన్ చేయకండి, ఇక మీకు రూపాయి సెండ్ చేసి మీ డీటెయిల్స్ చూసుకోవాలి అని కంపెనీ నుంచి పంపుతున్నాం మెయిల్ అని వస్తోంది. అవి కూడా ఎక్కడా ఓపెన్ చేయకండి.

దేశంలో సైబర్ దాడులు భారీగా పెరగవచ్చని కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం పేరుతో కేటుగాళ్లు వల విసురతారని ఆ వలలో చిక్కుకోవద్దని సూచించింది. మీకు ఎవరూ ఉచితంగా నగదు ఇస్తాం అని మెయిల్ పంపరు , ఇలా వచ్చింది అంటే మీడేటా చోరికే బీ అలర్ట్ అంటున్నారు అధికారులు.