చాలా మంది ఉదయం లేవగానే టీ తాగుతారు.. ఈ కప్పు టీ తాగకపోతే ఏదో అయినట్లు ఫీల్ అవుతారు, వారికి టీ కచ్చితంగా కడుపులో పడాలి. ఇక టీ ఎంత ఉంటుంది మనకు 10 లేదా 20 మహా అయితే పెద్ద హోటల్స్ 100 ఉంటుంది, ఇక స్పెషల్ టీ మారేకొద్ది రేటు పెరుగుతుంది.
ఇక్కడ ఒక కప్పు టీ ధర మాత్రం రూ. 1000 అట. ఆశ్చర్యపోకండి దానికి కారణం కూడా ఉంది..పశ్చిమ బెంగాల్లోని ఓ రోడ్డు పక్కన ఉంటుంది. కొల్కతాకు చెందిన పార్థ ప్రతీం గంగూళీ అనే వ్యక్తి తన టీ స్టాల్లో వంద వెరైటీలు అమ్ముతున్నాడు, అది అతని స్పెషాలిటీ.
అనేక రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇక ఇక్కడకు కొత్త వారు ఎవరు వచ్చినా ఈ టీ తాగుతారు, 2014లో అతను ఈ స్టాల్ ప్రారంభించాడు..115 రకాల టీలు అమ్ముతున్నాడు. కిలో 2.8 లక్షలు పలికే జపాన్ స్పెషల్ టీ పొడి కూడా ఇతని దగ్గర ఉంది.
ఈ టీ 1000 రూపాయలు అమ్ముతాడు, ఇది చాలా స్పెషల్ టీ.. ఇక రకరకాల టీ పౌడర్లు కూడా అమ్ముతూ ఉంటాడు, ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు.