ఈ గ్రామంలో లాక్ డౌన్ ఎలా పాటిస్తున్నారో చూసి షాకైన స్టేట్ జ‌నం

ఈ గ్రామంలో లాక్ డౌన్ ఎలా పాటిస్తున్నారో చూసి షాకైన స్టేట్ జ‌నం

0
83

ఈ వైర‌స్ వ్యాప్తి మ‌రింత పెరుగుతున్న వేళ కొత్త‌వారిని అస‌లు గ్రామాల్లోకి రానివ్వ‌డం లేదు, అంతేకాదు పాత‌వారికి నో ఎంట్రీ అంటున్నారు.. ప‌ది ఎక‌రాల పొలం ఉన్నా కోటి రూపాయ‌ల ఇళ్లు ఉన్నా క‌చ్చితంగా వేరే చోట నుంచి ఇక్క‌డ‌కు వ‌స్తే క్వారంటైన్ కు వెళ్లాల్సిందే అంటున్నారు.

అయితే ఓ వ్య‌క్తి లారీ డ్రైవ‌ర్ వృత్తి రిత్యా మందుల లోడు తీసుకుని గుజ‌రాత్ వెళ్లాడు, అత‌ను విశాఖ నుంచి గుజ‌రాత్ వెళ్లాడు. అక్క‌డ నుంచి త‌న సొంత గ్రామంకు ఈ నెల 5న వ‌చ్చాడు, అయితే గుజ‌రాత్ వెళ్లావు కాబ‌ట్టి కాస్త జాగ్ర‌త్త ఉండాలి గ్రామంలోకి రాకుండా ఉండాలని చెప్పారు గ్రామ‌పెద్ద‌లు.

వెంట‌నే గ్రామం ఎంట్ర‌న్స్ లో అక్క‌డ ఓ టార్బ‌ల్ వేశారు.. అక్క‌డే 14 రోజులు ఉండాలి అని చెప్పారు క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోతే ఇంటికి పంపిస్తాం అన్నారు.. అత‌ను అక్క‌డే స్నానం నిత్య కాల‌కృత్యాలు తీర్చుకుంటున్నాడు.

ఇంటినుంచి భోజ‌నం వ‌స్తుంది.. అది కూడా దూరంగా అక్క‌డ పెట్టి వారు వెళ్లిపోతున్నారు, ఈ జ‌నం చేస్తున్న ప‌నికి నిజంగా అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. గ్రామం నుంచి ఎవరూ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా 24 గంట‌లు న‌లుగురు కుర్రాళ్లు మూడు షిఫ్టుల్లో కాప‌లా ఉంటున్నారు.