ఇప్పుడు ప్రపంచమే లాక్ డౌన్ లో ఉంది, దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంటికి పరిమితం అయ్యారు ఇక ఉద్యోగులు అయితే చాలా వరకూ ఇంటి నుంచి పని చేస్తున్నారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హొమ్ కాన్సెప్ట్ తోనే ఉన్నారు.
అయితే డిజైనింగ్ , సాఫ్ట్ వేర్ కంపెనీలు కచ్చితంగా గ్రూప్ కాల్ చేసుకోవాల్సిందే, అందులో వర్క్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటారు, అయితే ఈ సమయంలో చాలావరకూ మన దేశంలో జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారు, ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు.
కాని ఇలా ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా పాల్గొనడం అంత మంచిది కాదు అని
కేంద్ర హోం శాఖ సూచించింది. భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. ఇక పలు భద్రతా కారణాల వల్ల ఇది కేంద్రం తెలియచేసింది అంటున్నారు టెక్ నిపుణులు.