తెలంగాణలోకి మళ్లీ ఆ విలీన గ్రామాలు..?

Those merged villages into Telangana ..!

0
86

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

సీఎం కేసీఆర్‌ ఈ గ్రామాలను తిరిగి సాధించుకునేందుకు ఓవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుండటంతో పాటు మరో వైపు అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో ఆ ఐదు గ్రామాల ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కూనూరు, చింతూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పాక్షికంగా పోలవరం ముంపు గ్రామాల పేరుతో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.