దేశంలో కరోనా మార్చినెల చివరి నుంచి ప్రతాపం చూపిస్తోంది.. లాక్ డౌన్ వేళ చాలా వరకూ కరోనా కేసులు తగ్గాయి..ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కడికక్కడ ప్లైట్ బస్సులు రైళ్లు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.. లేకపోతే కోట్ల మందికి కరోనా సోకేది. అయితే ఇప్పుడు విమానాలు ఇంకా చాలా వరకూ అంతర్జాతీయంగా నడవడం లేదు. దేశీయంగా కొన్ని సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి.
ఇక సెకండ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంది.. ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ విమానాల రాకపోకలను డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.
ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో అన్నీ విమానాలు రాకపోకలు సాగనిస్తే, మళ్లీ పాత స్దితికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాల సేవలు ఉంటాయి.