తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడికి ప్రయత్నం చేసిన కార్యకర్త

తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడికి ప్రయత్నం చేసిన కార్యకర్త

0
104

తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మళ్లీ వైసీపీలో రాజకీయ లుకలుకలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా జిల్లాలో కొందరు నేతల వ్యవహారం పై ఇటీవల కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి, అయితే తాజాగా ఓ నేతపై దాడికి యత్నించాడు ఓ వ్యక్తి.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పర్యటనలో బుధవారం భీమేశ్వరాలయం దగ్గరకు వచ్చారు, ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, అమలాపురం వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులుపై వైసీపీ కార్యకర్త, చెప్పుతో దాడికి ప్రయత్నించాడు అనే వార్త కలకలం రేపింది..

ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ అనుచరుడైన మేడిశెట్టి ఇజ్రాయెల్ చెప్పుతో దాడికి యత్నించాడు. ఈ సమయంలో వైవీతో పాటు కారులో ఆయన వెంట మంత్రి మోపిదేవి విశ్వరూప్ తోట త్రిమూర్తులు వచ్చారు,, ఈ సమయంలో కారులో నుంచి తోట త్రిమూర్తులు కిందకి దిగుతుండగా ఇజ్రాయెట్ చెప్పుతో దాడికి ప్రయత్నం చేశాడు, వెంటనే దీనిని గమనించిన మంత్రి మోపిదేవి ఇజ్రాయెల్ ని గెంటివేశారట, అయితే విభేదాలతోనే ఇలాంటి ఘటనలు అని అంటున్నారు అక్కడ నేతలు.