ఏపీలో మద్యం షాపుల ముందు తొలిరోజు బారులు తీరారు జనం , తర్వాత ఏకంగా 75 శాతం ధరలు పెంచడంతో మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, మొన్నటి క్యూ లు కనిపించలేదు అనే చెప్పాలి నేడు . అయితే తొలిరోజు ఉన్నా సీన్ ఎక్కడా కనిపించలేదు, అయితే మందు బాబులు కొన్ని చోట్ల మాత్రం ఉదయం నుంచి బారులు తీరుతున్న స్దితి కనిపిస్తోంది.
ప్రజలను మద్యానికి దూరం చేేందుకు ఇప్పుడు మరిన్ని ఆంక్షలను కూడా విధించింది. వీటిల్లో భాగంగా ఆధార్ కార్డును చూపిస్తేనే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మద్యం దుకాణాలు అక్కడ తీయకపోవడంతో ఆరెంజ్ జోన్లలోకి కూడా వస్తున్నారు.
ఈ కారణంగానే ఆధార్ కార్డును పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు వెల్లడించారు. ముఖానికి మాస్క్, గొడుగులు ధరించి మాత్రమే మద్యం కోసం రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇలాంటి కఠిన నిర్ణయాలు ఆంక్షలు పెడితే మద్యం షాపుల ముందు ఇలాంటి క్యూ లు ఉండవు అంటున్నారు జనం.