మూడు రాజధానులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

మూడు రాజధానులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

0
98

తొలిసారి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా రాజ్ భవన్ నుంచి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు… ఈ సంధర్భంగా మూడు రాజధానులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు… పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని అన్నారు…

అన్ని ప్రాంతాల అభివృద్దే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు… ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు… ఈ విషయంలో తన ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు… అమరావతి శాసన రాజధానిగా విశాఖ పట్నం కార్యనిర్వాహక రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని అన్నారు…

భవిష్యత్ లో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని అన్నారు… కాగా గతంలో మూడు రాజధానులు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది మండలిలో ఆమోదం పొందలేకపోయిన సంగతి తెలిసిందే…