బెంగాల్ లో ఉత్కంఠ పోరు..గెలుపెవరిదో?

Thriller fight in Bengal..Didi in the lead

0
142

పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల కౌంటింగ్ లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దూసుకెళ్తున్నారు. 12వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థిపై ఆమె 35 వేల ఓట్లతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేసి ఓడిపోయిన మమతా బెనర్జీ..భవానీపూర్ నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే.

కాగా సీఎం పీఠాన్ని కాపాడుకోడానికి ఆమెకు విజయం తప్పనిసరి కాగా ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. పశ్చిమ బెంగాల్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. మిగతా రెండు స్థానాల్లోనూ  తృణముల్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు.