తూ… సిగ్గులేని జన్మలు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తూ... సిగ్గులేని జన్మలు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
81

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటారని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి… తుప్పు నాయుడుది ముగిసిన చరిత్ర అని ఆరోపించారు… విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్ లో తలదాచుకున్నారని మండిపడ్డారు…. రేపు ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు… ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నారని మండిపడ్డారు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానకున్నారని ఆరోపించారు..

దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోందని అన్నారు యువ ముఖ్యమంత్రి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అంతా ప్రశంసిస్తుంటే పచ్చ వైరస్ రక్తంలోకి ఎక్కించుకున్న వాళ్లకు నిద్రపట్టడం లేదని అన్నారు. జగన్ పై అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతల పైన దొంగదాడికి తెగబడుతున్నారు. తూ… సిగ్గులేని జన్మలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు…

చంద్రబాబును నమ్ముకుని రోడ్డున పడ్డవాళ్ల గతి ఏమిటో చూస్తున్నామని అన్నారు. తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయనిచ్చే నోట్లకు ఆశపడి జీవితాలు నాశనం చేసుకోకండని అన్నారు. రాజకీయ మనుగడ కోసం కులం, ప్రాంతం, ఇలా ఎన్నో రకాలుగా రెచ్చగొడ్తారు. కసాయి వెంట నడిచే గొర్రెల్లాగా మిగిలిపోకండని అన్నారు..