కృష్ణయ్యను చంపిన వారికి తుమ్మల నాగేశ్వరావు వార్నింగ్..

0
102

టీఆర్ఎస్ నేత దారుణ హత్య తెలంగాణ వ్యాప్తంగా అందరిని కలచివేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడైన తమ్మిన్ని కృష్ణయ్యను ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తులు, కొడవళ్లతో అతి కిరాతకంగా నరికిచంపారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చంపినవారికి  సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా  తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ..కాలం చెల్లిన కొంతమంది అరాచకాలు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేత కృష్ణయ్యను చంపిన వారు.. ఎవరైనా సహించబోమమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వార్నింగ్‌ ఇచ్చారు.