చైనాకు చెందిన పలు యాప్ లపై భారత్ నిషేధం విధించింది, దీంతో ఆ కంపెనీలు మెయిన్ బిజినెస్ జరిగే చోట ఇలా ఆగిపోవడంతో డైలమాలో ఉన్నాయి, అందులో ముందు టిక్ టాక్ గురించి చెప్పుకోవాలి, ఈ కంపెనీకి ఇప్పుడు ఏంచేయాలో తోచడం లేదు, భారత్ లోనే వీరికి అత్యధిక యూజర్లు ఉన్నారు.
ఇప్పుడు ఆదాయం కూడా పోయింది, అయితే ఏకంగా హెడ్ ఆఫీస్ ని చైనా నుంచి తరలించాలి అని భావించారు.. కాని అది కూడా జరిగేలా లేదు,. ఎందుకు అంటే చైనాకు చెందిన ప్రముఖ వీడియో యాప్ టిక్ టాక్ ను కూడా నిషేధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
ఇక్కడ మరో విషయం అన్నారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ను అమెరికా కంపెనీగా గుర్తించాలని… అలాగైతే టిక్ టాక్ పై నిషేధం విధించబోమని ఆయన ప్రకటించారు. దీంతో, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగంలోకి దిగింది. టిక్ టాక్ ను సొంతం చేసుకోవడానికి బైట్ డ్యాన్స్ తో చర్చలను ప్రారంభించింది. మొత్తానికి మరో రెండు రోజుల్లో దీనిపై కీలక ప్రకటన వస్తుంది అంటున్నారు అనలిస్టులు.