టీకా తీసుకునేవారు తెలుసుకోండి — కొవిన్ యాప్లో కొత్త ఫీచర్.. ఇక కోడ్ చెబితేనే టీకా

టీకా తీసుకునేవారు తెలుసుకోండి -- కొవిన్ యాప్లో కొత్త ఫీచర్.. ఇక కోడ్ చెబితేనే టీకా

0
85

కొవిన్ యాప్లో తాజాగా కొత్త సెక్యూరిటీ కోడ్ ను తీసుకువచ్చింది కేంద్రం..యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఇక వ్యాక్సినేషన్ సమయంలో ఆ కోడ్ మీరు చెబితేనే టీకా వేస్తారు.. ఇక ఆ కోడ్ చెప్పకపోతే టీకా వేయరు.

 

సెక్యూరిటీ పరమైన లోపాలతోపాటు వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ సరికొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది, ఇక ప్రతీ ఒక్కరు టీకా సమయంలో ఈ కోడ్ చెప్పాల్సిందే.. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు, ఇది అర్దం కాక ఏం చేయాలో తెలియక కొందరు ఉంటున్నారు.

 

కొందరు స్లాట్ బుక్ చేసుకున్నా సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లకపోవడంతో వ్యాక్సిన్ వేయించుకున్నట్టు మెసేజ్ వస్తోంది.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఈ సెక్యూరిటీ ఫీచర్ను తీసుకొచ్చింది. ఇది ఒకింత మంచిదే అంటున్నారు నిపుణులు.