టిక్ టాక్ అంటే తెలియని వారు లేరు ..అంతలా ప్రజలకు బాగా దగ్గర అయింది ఈ యాప్…అయితే ఇప్పుడు ఈ యాప్ పై నిషేదం విధించింది కేంద్రం ..దీంతో ఈ యాప్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, ఇక మార్కెట్లో ఇప్పుడు యాప్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు టెక్ నిపుణులు.
ఇక ప్లేస్టోర్ లో టిక్ టాక్ చూపించడం లేదు, అయితే దీనికి సరిసమానమైన యాప్స్ మన దేశంలో కూడా చాలా మంది తయారు చేస్తున్నారు, టిక్ టాక్ ఉండటంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు.. కాని ఇప్పుడు టిక్ టాక్ లేకపోవడంతో అందరూ వీటిని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.
చట్‌పట్ అనే పేరుతో టిక్ టాక్ యాప్ ను ఏ విధంగానైతే ఉపయోగిస్తారో అచ్చం అదే విధంగా ఈ ఛట్ పట్ యాప్ ను తయారు చేశాడు మన తెలంగాణ యువకుడు. ఇప్పుడు దీనికి డిమాండ్ పెరిగింది, హైదరాబాదీ యువత మరింత మంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు…వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన నస్కంటి శ్రీనివాస్ చట్‌పట్ యాప్‌కు రూపకల్పన చేశారు.ఈ యాప్ జూన్ 29న ప్లేస్టోర్ లోకి రాగా కేవలం ఒక్క రోజులోనే దీన్ని మూడువేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు వచ్చే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది అంటున్నారు అందరూ.