టిక్ టాక్ కు ట్రంప్ గుడ్ న్యూస్ మరో డెడ్ లైన్

టిక్ టాక్ కు ట్రంప్ గుడ్ న్యూస్ మరో డెడ్ లైన్

0
88

టిక్ టాక్ కు 2020 అస్సలు కలిసి రాలేదు, ఓ పక్క భారత్ లో అమెరికాలో తన యూజర్లను కోల్పోతోంది, అయితే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ రెండు దేశాల్లో టిక్ టాక్ సేవలు ఆగిపోయాయి, అయితే
టిక్టాక్కు ట్రంప్ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు.

ఇప్పటికే ఇచ్చిన గడువు 45 రోజులు, కాని మరో 45 రోజులు ఇచ్చారు, దీంతో 90 రోజులు గడువు ఇచ్చారు.
టిక్టాక్కు నవంబర్ 12 వరకు గడువు లభించింది. అయితే అమెరికాలోని ఏదైనా కంపెనీకి అమ్మడమా అలాగే అమెరికన్ యూజర్ల డేటాను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది.

దీంతో బైట్డ్యాన్స్ పూర్తి గా దీనిపై ఫోకస్ చేసింది, ఇప్పటికే అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్, అలాగే ట్విటర్ కూడా టిక్టాక్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక అమెరికా జాతీయ భద్రతను బైట్డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరి ఏమవుతుందో చూడాలి.